Header Banner

ఏపీ పీజీసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు..! రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే?

  Wed May 07, 2025 16:18        Education

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (APPGCET-2025) ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మే 5వ తేదీతో ముగిసింది. అయితే విద్యార్ధుల విన్నపం మేరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటన జారీ చేసింది. దీంతో మే 11 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ వంటి దాదాపు 150కిపైగా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

రూ.1000 ఆలస్య రుసుముతో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.2000 ఆలస్య రుసుముతో మే 21 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో మే 24 వరకు, రూ.10,000 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. హాల్‌ టికెట్లను మే 30, 2025 వతేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీజీసెట్‌ ప్రవేశ పరీక్షలు జూన్‌ 9 నుంచి 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సీయూఈటీ 2025 పీజీ ఫైనల్‌ కీ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే?
కేంద్రీయ యూనివర్సిటీలతో సహా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పలు యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల నిర్వహించన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2025 ఫైనల్‌ కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్షకు సంబంధించి తుది కీ లిస్ట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరించింది. కాగా మార్చి 13, 15, 16, 18, 19, 21 నుంచి 30, ఏప్రిల్‌ 01వ తేదీల్లో దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APPGCET2025 #PGAdmissions #APHigherEducation #EntranceExam #PGCETUpdates #StudentAlert #ExamDates